![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -339 లో....రామలక్ష్మి వేలంపాటకి వస్తుంది. తనపై ఓడిపోవద్దని శ్రీలత ఎక్కువ అమౌంట్ కి వేలం వేస్తుంది. దాంతో శ్రీలతనే ఆ ల్యాండ్ సొంతం చేసుకుంది. అప్పుడే ఆ ల్యాండ్ కి సంబంధించిన ఓనర్ వచ్చి రామలక్ష్మికి థాంక్స్ చెప్తాడు. ఎక్కువ అమౌంట్ కి శ్రీలత వాళ్ళే అమౌంట్ తీసుకునేలా రామలక్ష్మి చేస్తుంది. దాంతో శ్రీలత వాళ్ళు షాక్ అవుతారు.
ఆ తర్వాత సుశీల, ఫణీంద్రల దగ్గరికి శ్రీవల్లి వెళ్లి రామలక్ష్మినే మైథిలినా కన్ఫమ్ చేసుకోవడానికి వెళ్తుంది. దాంతో సుశీల ఏ మాత్రం డౌట్ రాకుండా మాట్లాడుతుంది. నువ్వు నాతో మాట్లాడడమేంటి? మా ఇంట్లో పని మనుషుల స్థాయి మీది అని సుశీల అనగానే.. శ్రీవల్లి వెళ్లిపోతుంది.ఆ తర్వాత రామ్ ని తీసుకొని సీతాకాంత్ స్కూల్ కి వెళ్లి రామలక్ష్మి కోసం వెయిట్ చేస్తాడు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. సీతా సర్ నా నోటితో నేనే రామలక్ష్మి అని చెప్పించాలని చాలా ట్రై చేస్తున్నాడు. బయటపడొద్దని రామలక్ష్మి అనుకొని వెళ్లి రామ్ తో సీతాకాంత్ తో మాట్లాడుతుంది. సీతాకాంత్ కి రామలక్ష్మి షేక్ హ్యాండ్ ఇస్తుంది. సీతాకాంత్ అదంతా ఉహా అనుకుంటాడు. అప్పుడే సీతాకాంత్ ని రామ్ గిల్లగానే ఇది నిజామా అనుకుంటాడు.
మరొకవైపు శ్రీలత వాళ్ళు.. తను రామలక్ష్మినా మైథిలినా అని ఆలోచిస్తుంటే.. సందీప్ వచ్చి రామలక్ష్మి చనిపోయిందన్నట్లు డెత్ సర్టిఫికెట్ తీసుకొని వస్తాడు. రామలక్ష్మి చనిపోయింది తను మైథిలీ.. మొన్ననే లండన్ నుండి వచ్చిందని కనుకున్నానని సందీప్ చెప్పగానే.. శ్రీలత రిలాక్స్ అవుతుంది. కానీ ఆ మైథిలి సీతాకి ఎదరుపడకుండా చూడాలని శ్రీలత అంటుంది. మరోవైపు రామలక్ష్మి రామ్ కి క్లాస్ చెప్తుంటే.. అసలు వినకుండా రామలక్ష్మికి చిరాకు తెప్పిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |